ballistic missile test :ఖండాంతర క్షీపణిని విజయవంతంగా పరీక్షించిన అమెరికా

ABN , First Publish Date - 2022-08-17T03:41:21+05:30 IST

ఉక్రెయిన్-రష్యా, తైవాన్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తల నడుమ రెండు పర్యాయాలు వాయిదాపడిన దీర్ఘశ్రేణి, అణ్వాయుధ సామర్థ్యమున్న

ballistic missile test :ఖండాంతర క్షీపణిని విజయవంతంగా పరీక్షించిన అమెరికా

వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా, తైవాన్-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తల నడుమ రెండు పర్యాయాలు వాయిదాపడిన దీర్ఘశ్రేణి, అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షీపణిని(ballistic missile test) అమెరికా(USA) విజయవంతంగా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆయుధరహిత ‘మినిట్‌మ్యాన్ 3’ (Minuteman III) క్షిపణిని ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రయోగించింది. పనితీరు పరిశీలనలో భాగంగా చేపట్టిన ఈ క్షీపణి పరీక్ష సాధారణమైనదని, క్రమబద్ధ కార్యకలాపాల్లో భాగమని అమెరికా ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ఇలాంటి టెస్టులు ఇంతకుముందు 300 సార్లకుపైగా నిర్వహించామని ప్రస్తావించింది. కాగా ఒక టెస్ట్ రీ-ఎంట్రీ వెహికిల్ మీద నుంచి క్షీపణిని లాంచ్ చేశారు. యుద్ధ సమయాల్లో వ్యూహాత్మక ప్రాంతాలకు క్షీపణులను మోసుకెళ్లేందుకు వీలుంటుంది. కాగా ఈ రీఎంట్రీ వెహికిల్ 4200 మైళ్లకుపైగా(6760 కిలోమీటర్లు) దూరం ప్రయాణించి పశ్చిమ పసిఫిక్‌లోని మార్షల్ ద్వీపాల్లోని క్వజాలిన్ అటోల్‌కు చేరుకుంది. 

Updated Date - 2022-08-17T03:41:21+05:30 IST