అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిపై విమర్శలు.. కుటుంబమంతా గన్నులు చేతబట్టి గ్రూప్ ఫొటో..

Dec 5 2021 @ 21:35PM

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు థామస్ మేసీ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనే ఇందుకు కారణం. ఆ ఫొటోలో మేసీ కుటుంబ సభ్యులందరూ గన్నులు చేతపట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేసీ.. శాంటా.. ఈ క్రిస్మస్‌కు బుల్లెట్లు తీసుకురా అంటూ ట్విటర్‌ పోస్ట్ పెట్టారు. అంతకు కొద్ది రోజుల ముందే మిషిగన్ రాష్ట్రంలోని ఉన్న ఓ స్కూల్లో చదువుతున్న విద్యార్థి(15) సెమీ ఆటోమేటిక్ గన్ను చేతపట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలు తీశాడు. ఈ దారుణం నుంచి అమెరికా ఇంకా తేరుకోకమునుపే థామస్ ఇలా గన్నులు చేతబట్టి ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయనపై విమర్శలు చెలరేగుతున్నాయి.  

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.