ltrScrptTheme3

డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశాక.. ఆ ట్రాఫిక్ పోలీస్ చేసిన పనికి నెటిజన్ల హ్యాట్సఫ్!

Jul 10 2021 @ 20:31PM

వాషింగ్టన్: ఓ పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్‌ను డెలివరీ చేయడానికి వెళ్తున్న ఓ డెలివరీ బాయ్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన నేరం కింద జోన్స్బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సదరు డెలివరీ బాయ్ వద్ద నుంచి ఆ ఫుడ్‌ను పోలీసులు తీసుకున్నారు. అనంతరం ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు  అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ పోలీసే ఫుడ్‌ను డెలివరీ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను జోన్స్బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పోలీసు అధికారులు #ProtectandServe‌ తో తమ ఫేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ పోలీసు అధికారికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 


Follow Us on:

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.