డౌటే లేదు.. అమెరికా కరోనా మరణాలు సరిగా లెక్కించలేదు: ఫాసీ

ABN , First Publish Date - 2021-05-10T05:16:12+05:30 IST

కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ఇబ్బందులు పడిన అమెరికాలో.. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యను సరిగా లెక్కించడం జరగలేదని ఆ దేశ టాప్ వైద్య సలహాదారు ఆంథనీ ఫాసీ అన్నారు.

డౌటే లేదు.. అమెరికా కరోనా మరణాలు సరిగా లెక్కించలేదు: ఫాసీ

వాషింగ్టన్: కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ఇబ్బందులు పడిన అమెరికాలో.. ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్యను సరిగా లెక్కించడం జరగలేదని ఆ దేశ టాప్ వైద్య సలహాదారు ఆంథనీ ఫాసీ అన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలూ లేవని, కచ్చితంగా కరోనా మరణాలు తక్కువగా లెక్కించారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చూపిస్తున్న లెక్కల ప్రకారం, అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా వల్ల 5,81,000 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య కనీసం 9లక్షలపైగా ఉంటుందంటూ వచ్చిన ఒక విశ్లేషణపై మాట్లాడిన ఫాసీ.. ఇది తాను అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువ అని చెప్పారు. ఒక్కోసారి ఇలాంటి వాటికి ఉపయోగించే ప్రక్రియలు సరిగా పనిచేస్తాయని, కొన్నిసార్లు విఫలమవుతాయని ఫాసీ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-05-10T05:16:12+05:30 IST