పేద ప్రజల ఆకలి తీర్చిన జంట.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం!

ABN , First Publish Date - 2020-11-29T23:32:12+05:30 IST

థ్యాంక్స గివింగ్ డే సందర్భంగా దాదాపు 200 మంది ఆకలి తీర్చిన జంటపై సోషల్ మీడియా వేదికగా ప్రశం

పేద ప్రజల ఆకలి తీర్చిన జంట.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం!

వాషింగ్టన్: థ్యాంక్స గివింగ్ డే సందర్భంగా దాదాపు 200 మంది ఆకలి తీర్చిన జంటపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎమిలీ బగ్ (33), బిల్లి లూయిస్(34) డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడ్డారు. కానీ అమెరికాలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అది సాధ్యపడలేదు. ఈ క్రమంలో వారు ఓ నిర్ణయానికి వచ్చారు. పెళ్లిని సాదాసీదాగా చేసుకోవడం వల్ల మిగిలే 5వేల డాలర్ల(సుమారు రూ. 3,69,675)తో పేద ప్రజల ఆకలి తీర్చాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారు తమ వివాహాన్ని సిటీ హాల్‌లో గత నెలలో సింపుల్‌గా చేసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్నట్టే.. 5వేల డాలర్లను ఓ స్వచ్ఛంద సంస్థ పేరు మీద డిపాజిట్ చేసి, థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా సుమారు 200 మంది ఆకలిని తీర్చారు. స్వచ్చంద సంస్థకు డబ్బులను ఇచ్చేసి అంతటితో ఊరుకోకుండా ఆహార వితరణ కార్యక్రమంలో ఈ జంట స్వయంగా పాల్గోంది. ఈ క్రమంలో ఎమిలీ బగ్, బిల్లి లూయిస్‌‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 


Updated Date - 2020-11-29T23:32:12+05:30 IST