ఇంటికి మరమ్మతులు చేస్తుండగా బయటపడ్డ 105 ఏళ్ల నాటి విస్కీ బాటిళ్లు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-11-28T13:59:35+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. నిక్ డ్రమాండ్, పాట్రిక్ బేకర్ అనే భార్యాభర్తలు

ఇంటికి మరమ్మతులు చేస్తుండగా బయటపడ్డ 105 ఏళ్ల నాటి విస్కీ బాటిళ్లు.. అమెరికాలో..

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. నిక్ డ్రమాండ్, పాట్రిక్ బేకర్ అనే భార్యాభర్తలు తమ ఇంటికి మరమ్మతులు చేయించే సమయంలో 105 ఏళ్ల నాటి విస్కీ బాటిళ్లు బయటపడ్డాయి. ఇంటి గోడలలో మొత్తం 66 విస్కీ బాటిళ్లు ఉన్నట్టు భార్యాభర్తలు తెలిపారు. అక్రమంగా వస్తువులను అమ్మే వ్యక్తి ఆ ఇంటిని నిర్మించినట్టు గతంలో అనేక మంది చెప్పినట్టు భార్యాభర్తలు గుర్తుచేశారు. అయితే అప్పట్లో అవన్నీ పుకార్లు అని కొట్టిపడేశామని పేర్కొన్నారు. కానీ.. ఇప్పుడు గోడలలో విస్కీ బాటిళ్లను చూశాక పుకార్లన్నీ నిజమని అనిపిస్తోందన్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రస్తుతం ఆ ఇంటిని నిర్మించిన వ్యక్తి చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. ఆ వ్యక్తిపై డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నట్టు భార్యాభర్తలిద్దరూ తెలిపారు. కాగా.. ఓపెన్ చేయని విస్కీ బాటిళ్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని ఈ జంట నిశ్చయించుకుంది. ఒక్కో బాటిల్ ధర వెయ్యి డాలర్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Updated Date - 2020-11-28T13:59:35+05:30 IST