బిపిన్‌ రావత్‌ మృతిపట్ల అమెరికా రక్షణ శాఖ సంతాపం

ABN , First Publish Date - 2021-12-10T12:57:43+05:30 IST

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతిపట్ల అమెరికా రక్షణశాఖ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

బిపిన్‌ రావత్‌ మృతిపట్ల అమెరికా రక్షణ శాఖ సంతాపం

వాషింగ్టన్: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతిపట్ల అమెరికా రక్షణశాఖ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, సైనిక సహకారం లో రావత్‌ పెద్దన్న పాత్ర పోషంచేవారని అమెరికా అంతర్గత భద్రత కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ శాఖ కార్యదర్శి ఆస్టిన్‌ తెలిపారు. రావత్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అమె రికా సైన్యం జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీ, పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కిర్బీ, అంతర్గత భద్రత విభాగం అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌, పలువురు సెనేటర్లు కూడా రావత్‌తో అమెరికా బంధాన్ని గుర్తుచేసుకున్నారు. 


Updated Date - 2021-12-10T12:57:43+05:30 IST