ఫ్లోరిడా భవన ప్రమాదంలో మృతుల కోసం గాలింపు ఆపేసిన అమెరికా

ABN , First Publish Date - 2021-07-25T07:18:27+05:30 IST

కొన్నిరోజుల క్రితం అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక భారీ భవంతి కూలిపోయిన ఘటన గుర్తుందా? ఈ ప్రమాదంలో ఒక భారతీయ మూలాలున్న కుటుంబం కూడా కన్నుమూసింది.

ఫ్లోరిడా భవన ప్రమాదంలో మృతుల కోసం గాలింపు ఆపేసిన అమెరికా

ఫ్లోరిడా: కొన్నిరోజుల క్రితం అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక భారీ భవంతి కూలిపోయిన ఘటన గుర్తుందా? ఈ ప్రమాదంలో ఒక భారతీయ మూలాలున్న కుటుంబం కూడా కన్నుమూసింది. ఇప్పటి వరకూ ఈ 13 అంతస్తుల భవనం కూలిన ప్రదేశంలో మృతుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ గాలింపును నిలిపివేస్తున్నట్లు అమెరికా అగ్నిమాపక శాఖ వెల్లడించింది. జూన్ 24న ఈ భవనం కుప్పకూలగా శుక్రవారం వరకూ ఇక్కడ గాలింపు చర్యలు కొనసాగాయి. వీటిని ఇక ఆపేస్తున్నట్లు ప్రకటించిన అగ్నిమాపక శాఖ.. భవంతి కుప్పకూలిన తర్వాత కొన్ని గంటల తర్వాత దొరికిన వాళ్లంతా చనిపోయిన వారేనని తెలిపింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 97గా ఉంది. ఇంకా కేవలం ఒక వ్యక్తి ఆనవాళ్లు మాత్రమే లభించలేదని, మిగతా వారంతా దొరికారని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-25T07:18:27+05:30 IST