Advertisement

మా ఫ్యామిలీ పరిస్థితి మీకు రావొద్దు..!

Nov 26 2020 @ 19:51PM

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో ఉండే ఓ ఫ్యామిలీ ఇప్పడు అందరినీ హెచ్చరిస్తోంది. హెచ్చరించడం అంటే.. అదేదో భయపెట్టడం కాదు. ఈ కుటుంబం ఎదుర్కొంటున్న భయానక పరిస్థితి ఇతరులకు రావొద్దని చెబుతోంది. టెక్సాస్‌లోని ఈ కుటుంబానికి అసలేం జరిగింది? వారు దేని గురించి హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్సాస్‌లోని అర్లింగ్టన్‌లో నివాసముండే అలెక్సా అరగోనేజ్ ఫ్యామిలీ.. ఈ నెల ప్రారంభంలో వారి కుటుంబంలోని ఓ వ్యక్తి బర్త్‌డే సందర్భంగా అందరూ కలిసి లంచ్ చేశారు. ఇదే వారు చేసిన తప్పు. ఈ బర్త్‌డే లంచ్ ఏకంగా 15 మంది కరోనా బారిన పడేందుకు కారణమైంది. 

 

వీరిలో ముగ్గురు బయటి వారు కాగా, మిగిలిన 12 మంది ఒకే ఫ్యామిలీకి చెందినవారు. ప్రస్తుతం వీరందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితిలో ఒకచోట చేరి పార్టీలు చేసుకోవడం అంతా మంచిది కాదని అలెక్సా అరగోనేజ్ చెప్పారు. కరోనా విజృంభణ కొనసాగుతున్నందున ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండడం మంచిదన్నారు. మా ఫ్యామిలీ పరిస్థితి మీకు రావొద్దని చెప్పుకొచ్చారు.     

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.