Johnson & Johnson vaccine వల్ల రక్తం గడ్డ కడుతోంది...us ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-06T13:35:36+05:30 IST

జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది....

Johnson & Johnson vaccine వల్ల రక్తం గడ్డ కడుతోంది...us ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిక

వాషింగ్టన్:జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. 18 మిలియన్లకు పైగా అమెరికన్లకు ఇచ్చిన Johnson & Johnson Covid-19 vaccine వల్ల దుష్ప్రభావాలున్నాయని యూఎస్ ఎఫ్‌డీఏ తేల్చి చెప్పింది.ఈ వ్యాక్సిన్ రక్తం  గడ్డకట్టడానికి కారణమవుతుందని, దీనివల్ల వ్యాక్సిన్ అధీకృత వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించింది. మార్చి నాటికి  ఫెడరల్ శాస్త్రవేత్తలు 60 దుష్ప్రభావాల కేసులను గుర్తించారు. అందులో 9 కేసులు ప్రాణాంతకమని శాస్త్రవేత్తలు చెప్పారు. తక్కువ స్థాయి రక్త ప్లేట్‌లెట్లతో కలిపి అరుదైన, ప్రాణాంతక రక్తం గడ్డకట్టే సిండ్రోమ్ అయిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్ ప్రమాదం ఉందని ఎఫ్‌డీఏ నిర్ధారించింది. 


జాన్సన్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించిన తర్వాత ఒకటి నుంచి రెండు వారాల వరకు లక్షణాలు కనిపిస్తున్నాయని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు గత ఏడాది ఫిబ్రవరిలో అత్యవసర ఉపయోగం కోసం అమెరికా అధికారం ఇచ్చింది.టీటీఎస్ కేసులు సాధారణంగా టీకా వేసిన ఒకటి లేదా రెండు వారాల తర్వాత ప్రారంభమవుతాయి. లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కాలు వాపు, నిరంతర పొత్తికడుపు నొప్పి, తలనొప్పి లేదా అస్పష్టమైన దృష్టి వంటి నాడీ సంబంధిత లక్షణాలు లేదా టీకా వేసిన ప్రదేశంలో చర్మం కింద పెటెచియా అని పిలిచే ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని యూఎస్ శాస్త్రవేత్తలు చెప్పారు.


Read more