ఆ దేశానికి వెళ్లకండి.. అమెరికన్లకు ప్రభుత్వం హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-20T14:50:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు చేసింది. అత్యవసరం, తప్పదనుకుంటేనే

ఆ దేశానికి వెళ్లకండి.. అమెరికన్లకు ప్రభుత్వం హెచ్చరిక

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు హెచ్చరికలు చేసింది. అత్యవసరం, తప్పదనుకుంటేనే బ్రిటన్‌ ప్రయాణాలు పెట్టుకోవాలని సూచించింది. లేనిపక్షంలో బ్రిటన్‌కు వెళ్లకపోవడమే ఉత్తమమని తెలిపింది. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తన ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేసింది. తాజాగా బ్రిటన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేయడంతోపాటు మాస్కు తప్పనిసరి నిబంధన కూడా తొలగించారు. అయితే మాస్కు ధరిస్తేనే మంచిదని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో యూకేలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. గడిచిన వారంతో పోల్చుకుంటే ఈ ఆదివారం నాటికి యూకేలో కరోనా కేసులు 52 శాతం పెరిగినట్లు అధికారిక వర్గాలు అంచనా వేశాయి. యూకేలో ఇటువంటి పరిస్థితులు ఉండగా.. ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని అమెరికన్లకు అగ్రరాజ్యం సూచనలు చేస్తోంది.

Updated Date - 2021-07-20T14:50:09+05:30 IST