అమెరికా హెల్త్ సెక్రెటరికీ మళ్లీ కరోనా పాజిటివ్..నెలలోపే ఇది రెండోసారి..

ABN , First Publish Date - 2022-06-16T03:13:46+05:30 IST

: అమెరికా హెల్త్ సెక్రెటరీ జేవియేరా బెక్కేరా మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలారు. సోమవారం జరిపిన యాంటీజెన్ టెస్టుల్లో ఆయనకు కరోనా ఉన్నట్టు వెల్లడైంది.

అమెరికా హెల్త్ సెక్రెటరికీ మళ్లీ కరోనా పాజిటివ్..నెలలోపే ఇది రెండోసారి..

ఎన్నారై డెస్క్: అమెరికా హెల్త్ సెక్రెటరీ జేవియేరా బెక్కేరా మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలారు. సోమవారం జరిపిన యాంటీజెన్ టెస్టులో ఆయనకు కరోనా ఉన్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఆయనలో వ్యాధి లక్షణాలు ఓ మోస్తరు తీవ్రతలో ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఆయన బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. కాగా.. జేవియర్ కరోనా పాజిటివ్‌గా తేలడం ఇది రెండోసారి. గత నెలలో జరిగిన కరోనా పరీక్షల్లో కూడా ఆయన కరోనా బారిన  పడ్డట్టు తేలింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉంటూనే తన విధులు నిర్వర్తిస్తున్నారు. 



Updated Date - 2022-06-16T03:13:46+05:30 IST