కేపిటల్ ఘటన.. నాన్సి పెలోసి కీలక వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2021-01-16T21:55:55+05:30 IST

కేపిటల్ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రస్తకి లేదని యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి స్పష్టం చేశారు. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళి

కేపిటల్ ఘటన.. నాన్సి పెలోసి కీలక వ్యాఖ్యలు!

వాషింగ్టన్: కేపిటల్ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రస్తకి లేదని యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి స్పష్టం చేశారు. తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్.. ఈనెల 6న కేపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.. కేపిటల్ భవనం వద్ద బీభత్సం సృష్టించారు. భవనంలోకి దూసుకెళ్లి అజలడి సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పడ్డ ఘర్షణల్లో సుమారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 



కాగా.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెమొక్రాట్లు ట్రంప్‌పై దిగువసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కేపిటల్ భవనంలో అలజడి సృష్టించేందుకు.. కొంత మంది కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకారులకు సహాయం చేశారనే వాదన తెరపైకి వచ్చింది. డెమొక్రటిక్ పార్టీకి చెందిన మికీ షెర్రిల్ ఈ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో నాన్సి పెలోసి శుక్రవారం స్పందించారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొంత మంది కాంగ్రెస్ సభ్యులు కేపిటల్ భవనంలో అల్లర్లు చేసేందుకు ఆందోళనకారులకు సహాయం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ సభ్యులకు సంబంధం ఉన్నట్టు విచారణలో తేలితే క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-01-16T21:55:55+05:30 IST