సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యుడు.. మండిపడ్డ నాన్సీ పెలోసి

ABN , First Publish Date - 2021-07-29T22:04:11+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో యూఎస్ సీడీసీ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలపై రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రతినిధుల స

సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యుడు.. మండిపడ్డ నాన్సీ పెలోసి

వాషింగ్టన్: కరోనా విజృంభణ నేపథ్యంలో యూఎస్ సీడీసీ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలపై రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రతినిధుల సభలో మాస్క్ తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పందించారు. రిపబ్లికన్ పార్టీ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కారణం విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు.. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదనే నియమం అక్కడ అమలవుతుండగా.. దాన్ని సీడీసీ తాజాగా సవరించింది. పూర్తి స్థాయిలో టీకా తీసుకున్న వారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రతినిధుల సభలో సభ్యులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో ఇందుకు సంబంధించిన బిల్లును డెమొక్రటిక్ నేతలు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు, రిపబ్లికన్ పార్టీ నేత కెవిన్ మెక్‌కార్తీ ప్రసంగించారు. పూర్తి స్థాయిలో టీకా వేసుకున్న ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలంటూ సీడీసీ జారీ చేసిన మార్గదర్శకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


భారత్‌లో వెల్లడైన ఓ నివేదిక ఆధారంగా.. సీడీసీ ఈ మార్గర్శకాలను జారీ చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా సదరు నివేదికను ఇంత వరకూ ఎవరూ పరిశీలించలేదన్నారు. రివ్యూ కూడా చేయని నివేదిక ఆధారంగా సీడీసీ మార్గర్శకాలు ఎలా జారీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రతినిధుల సభలో మాస్క్ తప్పనిసరి చేయడం కోసం ప్రవేశపెట్టిన బిల్లును కెవిన్ మెక్‌కార్తీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కెవిన్ మెక్‌కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయనను ఓ మూర్ఖుడిగా నాన్సీ పెలోసీ అభివర్ణించారు. 


Updated Date - 2021-07-29T22:04:11+05:30 IST