భారత్‌కు వచ్చే ప్రయాణికులకు అమెరికా కీలక సూచన

ABN , First Publish Date - 2021-07-20T20:35:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. భారత్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారు.. తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే

భారత్‌కు వచ్చే ప్రయాణికులకు అమెరికా కీలక సూచన

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తమ దేశ పౌరులకు కీలక సూచనలు చేసింది. భారత్‌కు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న వారు.. తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తన ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేసింది. రెండో వేవ్ తర్వాత భారత్‌లో పరిస్థితుల ప్రస్తుతం మెరుగుపడ్డ నేపథ్యంలో ఇండియాను లెవల్ 4 జాబితా (ప్రయాణానికి అనుమతి లేని దేశాలు) నుంచి తొలగించి, లెవల్ 3 జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరింది. ఒక వేళ ఇండియాకు వెళ్లాల్సిందే అని డిసైడ్ అయితే.. ప్రయాణానికి ముందు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో కరోనా కేసులు క్రమంగా పెరగడానికి తోడు లాక్‌డౌన్ ఎత్తేయడం, మాస్క్ తప్పనిసరి నిబంధన కూడా తీసేయడంతో.. ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దని తమ పౌరులను కోరింది. 


Updated Date - 2021-07-20T20:35:20+05:30 IST