ట్రంప్ నో చెప్పిన ప్రచారానికి బైడెన్ ప్రభుత్వం ఓకే!

ABN , First Publish Date - 2021-05-09T00:56:40+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన చాలా వివాదాస్పద నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు.

ట్రంప్ నో చెప్పిన ప్రచారానికి బైడెన్ ప్రభుత్వం ఓకే!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం తర్వాత.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన చాలా వివాదాస్పద నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. ఈ క్రమంలో గతంలో ట్రంప్ నో చెప్పిన ఒక ప్రచారానికి బైడెన్ సర్కారు ఓకే చెప్పి మద్దతిస్తోంది. న్యూజిలాండ్ దేశం అంతర్జాతీయంగా ప్రారంభించి ‘యాంటీ-ఆన్‌లైన్ ఎక్స్‌ట్రీమిజం’ క్యాంపెయిన్‌కు గతంలో ట్రంప్ మద్దతివ్వలేదు. ఇది జరిగిన రెండేళ్లకు తాజాగా ఈ క్యాంపెయిన్‌లో తాము చేరుతున్నట్లు అమెరికా ప్రకటించింది.


గతంలో క్రీస్టు చర్చిలో 51 మందిని కాల్చి చంపిన ఒక ఉన్మాది.. తాను చేసిన ఘనకార్యాన్ని ఆన్‌లైన్‌లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. ఆ తర్వాత ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డెన్స్, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ‘యాంటీ-ఆన్‌లైన్ ఎక్స్‌ట్రీమిజం’ క్యాంపెయిన్‌కు 2019లో శ్రీకారం చుట్టారు. దీనిలో చేరడానికి ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది.

Updated Date - 2021-05-09T00:56:40+05:30 IST