‘అమెరికా అత్యున్నత పురస్కారంతో గాంధీని గౌరవించండి’

ABN , First Publish Date - 2021-08-14T21:41:42+05:30 IST

భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికా అత్యన్నత పురస్కారం ఇవ్వాలని న్యూయార్క్‌కు చెందిన చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి. మాలోనీ.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సత్యం, అహింసలను ఆయుధాలుగా మలుచుకుని ఇండియాకు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో మహాత్మా గాంధీ కీలక పోషించారని ఆమె పేర్కొన్నారు.

‘అమెరికా అత్యున్నత పురస్కారంతో గాంధీని గౌరవించండి’

వాషింగ్టన్: భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికా అత్యన్నత పురస్కారం ఇవ్వాలని న్యూయార్క్‌కు చెందిన చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి. మాలోనీ.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సత్యం, అహింసలను ఆయుధాలుగా మలుచుకుని ఇండియాకు స్వాతంత్ర్యం సాధించిపెట్టడంలో మహాత్మా గాంధీ కీలక పోషించారని ఆమె పేర్కొన్నారు. గాంధీ అనుసరించిన మార్గం.. అనేక మంది ప్రముఖులు, దేశాల్లో స్ఫూర్తి నింపినట్టు చెప్పారు. మహాత్మా గాంధీకి అమెరికా అత్యన్నత పురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ (మరణానంతరం) ’ను ప్రకటించి.. గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా.. ఒకవేళ మహాత్మా గాంధీకి కాంగ్రెషనల్‌ గోల్డ్‌ మెడల్‌ను ప్రకటిస్తే.. భారత్‌ గడ్డపై పుట్టి ఈ గౌరవం పొందిన తొలి వ్యక్తి ఆయనే అవుతారు. జార్జ్‌ వాషింగ్టన్‌, నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, మదర్‌ థెరిసా, రోసా పార్క్స్‌ తదితరులు ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. 


Updated Date - 2021-08-14T21:41:42+05:30 IST