జూలై 4 టార్గెట్ మిస్ అయ్యే అవకాశం: వైట్‌హౌస్

Jun 23 2021 @ 23:52PM

వాషింగ్టన్: కరోనా వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా ఒకటి. అందుకే ఇక్కడ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 నాటికి దేశంలోని పెద్దవారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం చాలా చర్యలే తీసుకుంది. కానీ ఇటీవలి కాలంలో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందగించింది. ఈ క్రమంలో జూలై 4 టార్గెట్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైట్ హౌస్ ప్రకటించింది. దేశంలో 27 ఏళ్లు పైబడిన వారిలో 70 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చని, కానీ అందరికీ వ్యాక్సిన్ అందివ్వడం కుదరకపోవచ్చని పేర్కొంది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.