Smuggling: వీడెవడండీ బాబు.. పాములు, బల్లులను ఏకంగా ప్యాంటులో దాచిపెట్టి స్మగ్లింగ్.. చివరికి

ABN , First Publish Date - 2022-08-27T16:17:41+05:30 IST

పాములు (Snakes), బల్లులు (Lizards) వంటి విషపూరిత సరిసృపాలను చూస్తేనే కొందరు భయంతో వణికిపోతారు.

Smuggling: వీడెవడండీ బాబు.. పాములు, బల్లులను ఏకంగా ప్యాంటులో దాచిపెట్టి స్మగ్లింగ్.. చివరికి

వాషింగ్టన్‌: పాములు (Snakes), బల్లులు (Lizards) వంటి విషపూరిత సరిసృపాలను చూస్తేనే కొందరు భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం వాటిని ఏకంగా తన ప్యాంటులో దాచి మరీ స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి అధికారులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. ఒకటికాదు రెండుకాదు ప్యాంటులో ఏకంగా 60 రకాల పాములు, బల్లులతో పాటు ఇతర సరిసృపాలను దాచి స్మగ్లింగ్‌ చేస‍్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వాటి విలువ 7.50లక్షల డాలర్లు(సుమారు రూ.6కోట్లు) ఉంటుందని అమెరికన్ అధికారులు తెలిపారు. ఈ సంఘటన యూఎస్, మెక్సికో బార్డర్‌లో వెలుగు చూసింది. ప్యాంటులో సరిసృపాలను దాచిపెట్టి అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడికి రెండు దశాబ్దాలకిపైగా జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. 


వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కాలిఫోర్నియా (South California)కు చెందిన జోస్‌ మాన్యుయెల్‌ పెరెజ్‌ (Jose Manuel Perez) అనే వ్యక్తి ఇలా ఆరేళ్లుగా జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని యూఎస్ అధికారులు తెలిపారు. ఈ ఆరేళ్లలో ఏకంగా 1,700 జంతువులను మెక్సికో, హాంకాంగ్‌ల నుంచి యూఎస్‌కు స్మగ్లింగ్‌ చేసినట్లు చెప్పారు. అయితే, ఈ ఏడాది మార్చిలో జోస్ బార్డర్ అధికారులకు పట్టుబడ్డాడు. పాములు, బల్లులు వంటి వాటిని ప్యాంటులో దాచి మెక్సికో నుంచి తరలిస్తుండగా దొరికిపోయాడు. మొదట అతని వద్ద బల్లులను గుర్తించిన అధికారులకు అవి తాను పెంచుకుంటున్నవి అని బుకాయించాడు. కానీ, అనుమానంతో అధికారులు అతడి దుస్తులు మొత్తం విప్పి పరిశీలించారు. దాంతో ప్యాంటులో 60 పాములు, బల్లులతో పాటు ఇతర సరిసృపాలు బయటపడ్డాయని అధికారులు వెల్లడించారు.


బుధవారం ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తన అక్రమరవాణాపై జోస్‌ పెరెజ్‌ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. జంతువులను అక్రమ రవాణా (Smuggling) చేసి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తన ఖాతాదారులకు సుమారు 7,39,000 డాలర్లకు సరిసృపాలను విక్రయించినట్లు తెలిపాడు. అందులో మెక్సికన్‌ పూసల బల్లులు, యుకాటాన్‌ బాక్స్‌ తాబేళ్లు, మెక్సికన్‌ బాక్స్‌ తాబేళ్లు, పిల్ల మొసళ్లు సహా ఇతర జంతువులు ఉన్నాయట. దీంతో న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 



Updated Date - 2022-08-27T16:17:41+05:30 IST