అందరూ ఉక్రెయిన్ నుంచి పారిపోతుంటే.. అమెరికా జాతీయుడేమో బాంబుల వర్షాన్ని లెక్క చేయకుండా..

ABN , First Publish Date - 2022-03-14T01:06:55+05:30 IST

తండ్రి పదానికి అసలైన ప్రతిరూపం ఆ అమెరికన్. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తన కూతురు, మనవరాలిని రక్షించేందుకు అతడు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా ఉక్రెయిన్ వెళ్లాడు. అతడి సంకల్పానికి అదృష్టం కూడా తోడవడంతో చివరకు తన కుటుంబాన్ని సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటకు తెచ్చుకోగలిగాడు.

అందరూ ఉక్రెయిన్ నుంచి పారిపోతుంటే..  అమెరికా జాతీయుడేమో బాంబుల వర్షాన్ని లెక్క చేయకుండా..

ఎన్నారై డెస్క్: తండ్రి పదానికి అసలైన ప్రతిరూపం ఆ అమెరికన్. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తన కూతురు, మనవరాలిని రక్షించేందుకు అతడు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా ఉక్రెయిన్ వెళ్లాడు. అతడి సంకల్పానికి అదృష్టం కూడా తోడవడంతో చివరకు తన కుటుంబాన్ని సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటకు తెచ్చుకోగలిగాడు. ఎంతటి ధైర్యవంతులు కూడా ఊహించలేని ఈ సాహస యాత్ర చేసిన అతడి పేరు విలియమ్ హబ్బార్డ్!


విలియమ్ హబ్బార్డ్ మసాచుసెట్స్ రాష్ట్రంలో ఉంటారు. ఆయన కూతరు ఎయిస్లిన్ 2018లో బ్యాలే నృత్యం నేర్చుకునేందుకు ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ ఉండగానే ఆమెకు ఓ బాబు పుట్టాడు. అయితే.. అది కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న సమయం. ఆమె బిడ్డ ఓ చిన్న ఇంట్లో పుట్టాడు. జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు వంటివేవీ ఆ చిన్నారికి లేకపోవడం అతడిని తీసుకుని ఉక్రెయిన్ వీడటం ఆ తల్లికి సాధ్యపడలేదు. ఈ లోపే.. యుద్ధం మొదలైపోయింది. ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన తన కూతురు, మనవడిని రక్షించుకునేందుకు విలియమ్స్ ఇటీవల సాహస యాత్రకు బయలు దేరారు.


 మొదట పోలాండ్‌కు చేరుకుని ఆపై కాలినడకన సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించారు. ఆ తరువాత.. కూడా కాలినడకనే ప్రయాణిస్తూ కీవ్‌లోని తన కూతురు, మనవరాలిని కలసుకున్నారు. అనంతరం.. వాళ్లిద్దరినీ తీసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఆయన.. శుక్రవారం నాడు స్లోవేనియాలో  కాలు పెట్టారు. ఇంతటి ప్రమాదకరమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగారు అని మీడియా వారు ప్రశ్నించగా.. ఏ తండ్రి అయినా ఇలాగే చేస్తాడు. తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు’’ అంటూ విలియమ్స్ తడుముకోకుండా సమాధానం చెప్పారు.

Updated Date - 2022-03-14T01:06:55+05:30 IST