
ఇంటర్నెట్ డెస్క్: మనం ఎయిర్‌పోర్టులో పోగొట్టుకున్న విలువైన వస్తువు ఏదైనా మన ఇంటికే డెలివరీ అయితే సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! మన సంబరానికి అంతే ఉండదు కదూ..! అమెరికాకు చెందిన పాపులర్ యూట్యూబర్ కేసీ నీస్టాట్ ఇటీవల ఇటువంటి అద్భుత అనుభవాన్నే చవిచూశాడు. తనకు చాలా ఇష్టమైన యాపిల్ వాచ్‌ను దుబాయ్ ఎయిర్‌పోర్టులో పొగొట్టుకున్నానంటూ కేసీ ఫిబ్రవరి 7న ఓ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి
అతడు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా దుబాయ్ నుంచి అమెరికాకు వచ్చాడు. దీంతో.. ఎమిరేట్స్ సంస్థ వెంటనే స్పందించింది. ‘‘అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు మా టీం ప్రయత్నిస్తోంది. వీలైనంత త్వరగా మీ సమస్య పరిష్కరిస్తాం’’ అంటూ సంస్థ రిప్లై ఇచ్చింది. మరో మూడు గంటల తరువాత సంస్థ మరో ట్వీట్ చేసింది. ‘‘వాచ్ దొరికింది... మీ ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అంటూ అప్డేట్ ఇచ్చింది. మాటిచ్చినట్టుగానే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్... గురువారం నాడు ఆ వాచ్‌ను కేసీ ఇంటికి డోర్ డెలివరీ చేసింది. దీంతో.. కేసీ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
ఇవి కూడా చదవండి
‘‘అప్పటికే ఆశలన్నీ వదులుకున్నా..వాచ్ ఇక ఎప్పటికీ దొరకదనుకున్నా.. కానీ ఎమిరేట్స్ సంస్థ మాత్రం నేను ఊహించని అద్భుతం చేసింది. ఆ వాచీని ఏకంగా ఇంటికే పంపించింది. ఇన్నేళ్లుగా విమానాల్లో ప్రయాణిస్తున్నా ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. అసలు ఈ సంస్థ చేయలేనిది ఏమైనా ఉందా..? ఎమిరేట్స్ నిజంగా నెం. 1’’ అంటూ ఆ ఎయిర్‌లైన్స్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు కేసీ..!
ఇవి కూడా చదవండి