Californiaలో కూలిన యూఎస్ మిలటరీ విమానం

ABN , First Publish Date - 2022-06-09T12:45:20+05:30 IST

దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ప్రమాదవశాత్తూ యూఎస్ సైనిక విమానం కూలిపోయింది....

Californiaలో కూలిన యూఎస్ మిలటరీ విమానం

లాస్ ఏంజిల్స్: దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం ప్రమాదవశాత్తూ యూఎస్ సైనిక విమానం కూలిపోయింది. మెక్సికన్ సరిహద్దు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లామిస్ సమీపంలో 3 డి మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్ వింగ్‌కు చెందిన విమానం కూలిపోయిందని యూఎస్ సైనిక ప్రతినిధి చెప్పారు.కూలిపోయిన సైనిక విమానంలో రేడియో ధార్మిక పదార్థం తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్లను సైన్యం ఖండించింది.కూలిపోయిన విమానం వల్ల ప్రాణ నష్టంపై తక్షణ సమాచారం లేదని యూఎస్ ఆర్మీ తెలిపింది. మార్చిలో నార్వేలో నలుగురు మెరైన్‌లు మరణించారు. గతంలో యూఎస్ మిలిటరీకి చెందిన పలు విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి.


Updated Date - 2022-06-09T12:45:20+05:30 IST