US: తండ్రి తుపాకీతో ఆడుకుంటూ.. పసికందును కాల్చిచంపిన మైనర్!

ABN , First Publish Date - 2022-06-29T17:40:03+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద చోటు చేసుకుంది.

US: తండ్రి తుపాకీతో ఆడుకుంటూ.. పసికందును కాల్చిచంపిన మైనర్!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద చోటు చేసుకుంది. 8ఏళ్ల బాలుడు తండ్రి తుపాకీతో ఆడుకుంటున్న సమయంలో అది అనుకోకుండా పేలడంతో పసికందు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. రోడెరిక్ రాండాల్‌(45) అనే వ్యక్తి ఇటీవల తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి తన స్నేహితురాలిని కలిసేందుకు మోటెల్‌ ప్రాంతానికి వెళ్లాడు. అదే సమయంలో అతడి స్నేహితురాలు తన ఇద్దరు కలలు, ఒక ఏడాది వయసు గల చిన్నారితో అక్కడికి వచ్చింది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్లంతా కలుసుకుని కాసేపు సరదాగా గడిపారు. అయితే, కొద్దిసేపటి తర్వాత రాండల్ ఏదో పని మీద బయటకి వెళ్లాడు. ఇంతలో అతని కుమారుడు అలమరాలో దాచిన తుపాకీని తీసి ఆడుకుంటున్నాడు. 


అదే సమయంలో అక్కడికి వచ్చిన చిన్నారుల తల్లి నిద్రిస్తుంది. బాబు ఆ తుపాకీతో ఆడుకుంటున్న సమయంలో అది ఒక్కసారిగా పేలింది. దాంతో పక్కనే ఉన్న పసికందు శరీరంలోంచి తూటా దూసుకెళ్లింది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్కాంబియా కౌంటీ పోలీసులు రాండాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందే అతడిపై గన్ కలిగి ఉండకుండా నిషేధం విధించబడింది. అతనికి నేరచరిత్ర ఉండడంతో నిషేధం కొనసాగుతోంది. దాంతో అతడిపై అక్రమంగా మారణాయుధం కలిగి ఉండడం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్కాంబియా కౌంటీ పోలీస్ చీఫ్ సిమన్స్ తెలిపారు. అయితే, ఇలాంటి దారుణ ఘటనలు అగ్రరాజ్యంలో తరచూ జరుగుతున్నాయి. పెద్దలు దాచిన తుపాకీని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటూ తమను తాము కాల్చుకోవడం లేదా తమ తోటివారిపై కాల్పులకు పాల్పడడం అనేది పరిపాటిగా మారింది. 

Updated Date - 2022-06-29T17:40:03+05:30 IST