Collison: ధ్వంసమైన US సబ్ మెరైన్..12 మంది నావికులకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-08T15:33:39+05:30 IST

అమెరికా దేశానికి చెందిన న్యూక్లియర్ జలాంతర్గామి సముద్రంలో గుర్తుతెలియని వస్తువును ఢీకొంది...

Collison: ధ్వంసమైన US సబ్ మెరైన్..12 మంది నావికులకు గాయాలు

వాషింగ్టన్: అమెరికా దేశానికి చెందిన న్యూక్లియర్ జలాంతర్గామి సముద్రంలో గుర్తుతెలియని వస్తువును ఢీకొంది.అణుశక్తితో అత్యంత వేగంగా నడిచే జలాంతర్గామి ధ్వంసం కావడంతో అందులో ఉన్న 12 మంది నావికులు గాయపడ్డారు. ఆసియాలో యూఎస్ అణు జలాంతర్గామి సముద్రపు నీటి అడుగున ఉన్నప్పుడు గుర్తు తెలియని వస్తువును ఢీకొని దెబ్బతిన్నట్లు అమెరికా నేవీ తెలిపింది.ఈ ప్రమాదంలో 12 మంది యూఎస్ నావికులు గాయపడ్డారని యూఎస్ తెలిపింది. దెబ్బతిన్న అణు జలంతర్గామి వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నామని, ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని అమెరికా నౌకాదళం తెలిపింది. ప్రమాదంలో దెబ్బతిన్న నౌక గువామ్ లోని యూఎస్ స్థావరానికి వెళుతోందని సమాచారం. 

Updated Date - 2021-10-08T15:33:39+05:30 IST