కారులో సూసైడ్ చేసుకున్న పోర్న్‌ స్టార్.. అంత్యక్రియల కోసం ఫండ్స్ సేకరిస్తున్న తల్లి

ABN , First Publish Date - 2021-07-17T18:56:38+05:30 IST

అమెరికాకు చెందిన డహ్లియా స్కై అనే పోర్న్ స్టార్ తన కారులోనే ఆత్మహత్యకు పాల్పడింది. తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆమె చనిపోయినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం వెల్లడించింది.

కారులో సూసైడ్ చేసుకున్న పోర్న్‌ స్టార్.. అంత్యక్రియల కోసం ఫండ్స్ సేకరిస్తున్న తల్లి

నార్త్‌రిడ్జ్, లాస్ ఏంజిల్స్: అమెరికాకు చెందిన డహ్లియా స్కై అనే పోర్న్ స్టార్ తన కారులోనే ఆత్మహత్యకు పాల్పడింది. తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆమె చనిపోయినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం వెల్లడించింది. జూన్ 30న డహ్లియా తన కారులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని డెవాన్‌షైర్ ప్రాంతంలో ఆమె కారులోనే దహ్లియా మృతదేహాన్ని గుర్తించినట్లు డిటెక్టివ్ దేవ్ పీటేక్యూ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ విభాగం ఇచ్చే పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అనంతరం దహ్లియా మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. 


కాగా, ఆమె కొన్నాళ్లు బ్రేస్ట్ క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందిన్నట్లు తెలిసింది. దీంతో గత కొంతకాలంగా దహ్లియా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు మెటాస్టాటిక్ బ్రేస్ట్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని వైద్యులు తెలియజేశారు. కాగా, దహ్లియా 2010లో బైలీ బ్లూ పేరుతో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. దహ్లియాకు సొంత ఇల్లు కూడా లేదని, ఇన్నాళ్లు కారులోనే జీవించినట్లు ఆమె తల్లి లిసా హేయిస్ చెప్పారు. నార్త్‌రిడ్జ్‌లో ఉండే ఆమె ఈ నెల మొదటల్లో తన కారులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తలపై గన్‌తో కాల్చుకుని చనిపోయినట్లు డిటెక్టివ్స్ చెప్పారని లిసా అన్నారు. దహ్లియా అంత్యక్రియలు, స్మారకం కోసం సాయం చేయాల్సిందిగా ఆమె కోరారు. తోచినంత ఆర్థికం సాయం చేసిన వారికి రుణపడి ఉంటామని లిసా హేయిస్ చెప్పుకొచ్చారు.  

Updated Date - 2021-07-17T18:56:38+05:30 IST