మనది విడదీయలేని భాగస్వామ్యం!

ABN , First Publish Date - 2022-08-16T06:51:41+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం, భారత్‌కు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఇరు దేశాలు విడదీయలేని..

మనది విడదీయలేని భాగస్వామ్యం!

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌


వాషింగ్టన్‌/మాస్కో, ఆగస్టు 15: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం, భారత్‌కు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఇరు దేశాలు విడదీయలేని భాగస్వాములని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘మన్ముందు కాలంలో ఇరు దేశాలు కలిసి మెలసి ప్రపంచ భద్రత, శ్రేయస్సు కోసం, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ వాణిజ్యం కోసం పాటుపడతాయని నాకు విశ్వాసం ఉంది’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ భారత్‌కు తమ శుభాకాంక్షల్ని తెలిపారు. ఇక.. భారత్‌, బ్రిటన్‌ల మధ్య బంధం వచ్చే 75ఏళ్లలో మరింతగా బలపడాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని భారతీయులు ఘనంగా జరుపుకొన్నారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలతో తమ దేశభక్తిని చాటుకున్నారు. కాగా, అమెరికాలోని బోస్టన్‌లో 220 అడుగుల ఎత్తులో ఎగురవేసిన భారత్‌-అమెరికా జెండా అందరి దృష్టినీ ఆకర్షించింది. 

Updated Date - 2022-08-16T06:51:41+05:30 IST