Joe biden: కరోనా పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌గా తేలిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

ABN , First Publish Date - 2022-08-01T02:34:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు శనివారం జరిపిన కరోనా పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. అంతకుమునుపు ఐదు రోజుల్లో జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని తేలగా.. శనివారం జరిపిన పరీక్షలో మాత్రం కరోనా ఉన్నట్టు బయటపడింది.

Joe biden: కరోనా పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌గా తేలిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు శనివారం జరిపిన కరోనా పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. అంతకుమునుపు ఐదు రోజుల్లో జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని తేలగా.. శనివారం జరిపిన పరీక్షలో మాత్రం కరోనా ఉన్నట్టు బయటపడింది. అయితే.. జో బైడెన్‌లో వ్యాధి లక్షణాలేవీ లేవని ఆయనకు చికిత్స చేస్తున్న డా. కెవిన్ పేర్కొన్నారు. అంతకుమును..బెడన్..పాక్సలోవిడ్ అనే వైరస్ నిరోధన మాత్ర తీసుకోవడం గమనార్హం. ఈ ఔషధం తీసుకున్న తరువాత కొంత మందిలో కరోనా పరీక్ష ఫలితం పాజిటివ్‌గా వస్తోంది. ఈ పరిణామాన్ని పాక్సలోవిడ్ రిబౌండ్ అని పిలుస్తున్నారు. గతంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంథొనీ ఫౌచీ కూడా ఇలా కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా.. ఈ ఎండా కాలంలో కరోనా వ్యాధిబారిన పడ్డ వారిలో మూడో వంతు మంది పాక్సలోవిడ్ ఔషధాన్ని తీసుకున్నారు. వీరిలో అనేక మంది తొలుత నెగెటివ్‌గా తేలినా.. ఔషధం తీసుకున్న తరువాత పాజిటివ్‌గా పరీక్షల్లో బయటపడింది. కాగా.. బైడెన్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయనలో వ్యాధి లక్షణాలు ఏవీ లేవని కెవిన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-01T02:34:50+05:30 IST