మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్

ABN , First Publish Date - 2022-06-24T13:10:23+05:30 IST

భారతీయ మహిళల శక్తి సామర్థ్యాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అపార నమ్మకం ఏర్పడినట్టుంది.

మరో భారతీయ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్

భారత సంతతి మహిళ అంజలికి అరుదైన గౌరవం

వాషింగ్టన్: భారతీయ మహిళల శక్తి సామర్థ్యాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అపార నమ్మకం ఏర్పడినట్టుంది. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్‌ ఆరతి ప్రభాకర్‌ను వైట్‌హౌస్‌ సైన్స్‌ సలహాదారుగా నామినేట్‌ చేసిన 24 గంటల్లోనే మరో ఇండో-అమెరికన్‌, ప్రము ఖ న్యాయ నిపుణురాలు అంజలి చతుర్వేదిని మరో కీలక పదవి.. అమెరికా పరిపాలనా విభాగంలో వెటరన్స్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు జనరల్‌ కౌన్సెల్‌గా నామినేట్‌ చేశారు. అంజలి తల్లిదండ్రులు భారత్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. న్యూయార్క్‌లోని కోర్ట్‌ల్యాండ్‌లో జన్మించిన ఆమె జార్జిటౌన్‌ యూనివర్సిటీ లా స్కూల్‌ అండ్‌ కార్నెల్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 

Updated Date - 2022-06-24T13:10:23+05:30 IST