ఉక్రెయిన్ సరిహద్దులో అడుగుపెట్టిన బైడెన్... ఉత్కంఠ

Published: Fri, 25 Mar 2022 20:41:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉక్రెయిన్ సరిహద్దులో అడుగుపెట్టిన బైడెన్... ఉత్కంఠ

వార్సా: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌లో అడుగుపెట్టారు. ఉక్రెయిన్‌కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలండ్ దక్షిణ ప్రాంతంలోని జేజౌ (Rzeszow) నగరానికి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన శరణార్ధులకు అందుతున్న సహాయక చర్యలను సమీక్షిస్తారు. నాటో బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బైడెన్ పర్యటన నేపథ్యంలో పోలండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉన్న యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా రసాయన ఆయుధాలు ఉపయోగించినా తాము ఉపయోగించబోమని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. ముడి చమురు విషయంలో రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈయూ, అమెరికా నిర్ణయించాయి.   


మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమ దేశానికి చెందిన 1351 మంది సైనికులు ఇప్పటివరకూ చనిపోయారని రష్యా ప్రకటించింది. 3,825 మంది గాయపడ్డారని వెల్లడించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.