Viral Video: బైడెన్.. మీకు అసలేమైంది..!

Published: Wed, 10 Aug 2022 20:27:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: బైడెన్.. మీకు అసలేమైంది..!

ఎన్నారై డెస్క్: జో బైడెన్.. 79ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా(US President Joe Biden) పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘బైడెన్ మీకు అసలేమైంది’ అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరోసారి ఎన్నికల బరిలో నిలవడం మీకు అవసరమా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)ను ఓడించి.. జో బైడెన్ అత్యంత శక్తి వంతమైన అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించారు. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించిన అత్యంత పెద్దవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ప్రస్తుతం అదే వయస్సు.. ఆయనను నవ్వులపాలు చేస్తోంది. వయసు మీద పడటం ద్వారా వచ్చిన సహజ మతి మరుపు.. నెటిజన్ల ముందు ఆయనను ఓ జోకర్‌గా మారుస్తోంది. మంగళవారం జో బైడెన్.. చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ 2022(CHIPS and Science Act 2022) సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడితోపాటు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమండో, సెనేట్ మెజారీటీ లీడర్‌ చుక్ షుమెర్‌తోపాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా చుక్ షుమెర్.. చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ గురించి మాట్లాడారు. అనంతరం వెనక్కి తిరిగి.. తొలుత బైడెన్‌కు షేక్ హ్యాండ్( handshake) ఇచ్చారు. తర్వాత అక్కడున్న ఇతర ప్రతినిధులకు చేయందించారు. అయితే జో బైడెన్ మాత్రం.. చుక్ షుమెర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారు. సెనేట్ మెజారిటీ లీడర్ ఇతర ప్రతినిధులకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే.. ఆయన నుంచి మరోసారి బైడెన్ షేక్ హ్యాండ్ ఆశించారు. అయితే ఆయన బైడెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవటంతో అయోమయానికి లోనయ్యారు. అనంతరం షేక్ హ్యాండ్ కోసం గాల్లోకి లేపిన చేయితో తన గడ్డాన్ని నిమురుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడున్న కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదికాస్తా నెట్టింటికి(Social Media) చేరడంతో వైరల్‌(Viral)గా మారింది. బైడెన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగ కూడా ఆయన ఇలానే ప్రవర్తించారు. 


ఇదిలా ఉంటే.. కెంటుకీ పర్యటన ముగించుకుని భార్యతో సహా వెనుతిరిగే సమయంలో బైడెన్ తడబడ్డారు. సూట్ వేసుకోవడానికి తీవ్రంగా శ్రమించి.. చివరికి విఫలమయ్యారు. అనంతరం తన భార్య సహాయంతో సూట్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కళ్లజోడు కింద పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకునే క్రమంలో సైతం బైడెన్ పాట్లు పడ్డారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.