Green cards: కీలక పరిణామం.. 6నెలల్లోపే ప్రాసెస్.. అమలైతే NRI ల దశాబ్దాల నిరీక్షణకు తెర!

ABN , First Publish Date - 2022-05-17T18:08:46+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేది Green card. దీనికోసం ఆ దేశంలోని వేలాది మంది వలసదారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తుంటారు. ఇలా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇలా గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే...

Green cards: కీలక పరిణామం.. 6నెలల్లోపే ప్రాసెస్.. అమలైతే NRI ల దశాబ్దాల నిరీక్షణకు తెర!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేది Green card. దీనికోసం ఆ దేశంలోని వేలాది మంది వలసదారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తుంటారు. ఇలా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇలా గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే వారికి అమెరికా సర్కార్ కొంత ఉపశమనం కలిగించే విషయం చెప్పింది. అమెరికాలో గ్రీన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను 6 నెలల్లోపు ప్రాసెస్‌ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్‌ తాజాగా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సిఫార్సును ఆమోదం కోసం వైట్‌హౌస్‌కు పంపించనున్నారు. 


ఆసియా అమెరికన్లు, నేటివ్‌ హవాయిన్స్‌, పసిఫిక్‌ ఐలాండర్స్‌(PACAANHPI)పై నియమించిన ఈ అడ్వైజరీ కమిషన్‌ సిఫార్సు అమలైతే మాత్రం Green Cards కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ-అమెరికన్ల నిరీక్షణకు తెరపడినట్లై. కాగా, ఈ ప్రతిపాదనను మొదట ప్రముఖ ఇండో-అమెరికన్ లీడర్ అజయ్ జైన్ భుటోరియా PACAANHPI సమావేశం సందర్భంగా అడ్వైజరీ కమిషన్ ముందు తెచ్చారు. ఆ సమయంలో అడ్వైజరీ కమిషన్‌లోని 25 మంది కమిషనర్లు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 


ఇక గ్రీన్‌కార్డుల ఇంటర్వ్యూలను కూడా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కమిషన్ సూచించింది. దీనికోసం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విభాగం నేషనల్ వీసా సెంటర్ (NVC) 2022 ఆగస్టు నుంచి అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని 3నెలల్లోపు 100శాతం ఇంటర్వ్యూలు పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం (ఏప్రిల్‌ 2022 నాటికి) 32,439 ఇంటర్వ్యూలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని.. 2023 ఏప్రిల్ నాటికి 150 శాతం పెంచాలని పేర్కొంది. ఆ తర్వాత గ్రీన్‌కార్డుల ఇంటర్వ్యూ, వీసా ప్రాసెసింగ్‌కు కాలవ్యవధి 6నెలలు ఉండేట్లు చూసుకోవాలని కమిషన్‌ సూచించింది. ఇదిలాఉంటే.. 2022 ఏప్రిల్‌లో Gree card ఇంటర్వ్యూలు 4,21,358 వరకు పెండింగ్‌లో ఉండగా.. ఈ సంఖ్య మార్చిలో 4,36,700గా ఉన్నట్లు భూటోరియా వెల్లడించారు. 1990లో తెచ్చిన ఇమ్మిగ్రేషన్ విధానంలో ఇప్పటివరకు ఎలాంటి సవరణలు జరగలేదని, ఇది కూడా ఒకవిధంగా గ్రీన్‌కార్డుల జారీ ఆలస్యానికి కారణమని ఆయన పేర్కొన్నారు.       

Updated Date - 2022-05-17T18:08:46+05:30 IST