ట్రంప్ డీల్‌ను రద్దు చేసిన బైడెన్

ABN , First Publish Date - 2021-01-28T21:51:27+05:30 IST

అమెరికా అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన పలు వివాదాస్పద ఆర్డర్లను ఇప్పటికే వెనక్కి తీసుకోవడం జరిగింది.

ట్రంప్ డీల్‌ను రద్దు చేసిన బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన పలు వివాదాస్పద ఆర్డర్లను ఇప్పటికే వెనక్కి తీసుకోవడం జరిగింది. తాజాగా ఆయుధ అమ్మకాలకు సంబంధించి ట్రంప్ తన పరిపాలన చివరి రోజుల్లో సౌదీ అరేబియా, యూఏఈలతో కుదుర్చుకున్న రెండు పెద్ద డీల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఒకరు బుధవారం కీలక ప్రకటన చేశారు. సౌదీ, యూఏఈలతో ట్రంప్ పరిపాలన విభాగం ఆయుధ అమ్మకాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను కొత్త ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసిందని ప్రకటించారు. ఈ ఒప్పందాలను తాజాగా పరిశీలించిన బైడెన్ తాత్కాలికంగా నిలిపివేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. ఈ ఒప్పందాలపై బైడెన్ పరిపాలన విభాగం పూర్తి విచారణ అనంతరం తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాగా, ఈ డీల్స్ ప్రకారం 23 బిలియన్ డాలర్లు విలువ చేసే ఎఫ్-35 జెట్స్‌ను యూఏఈకి అమెరికా ఇవ్వాల్సి ఉంది. 

Updated Date - 2021-01-28T21:51:27+05:30 IST