అమెరికాలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో రికార్డు స్థాయి కేసులు!

ABN , First Publish Date - 2020-12-20T16:21:35+05:30 IST

అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో రికార్డు స్థాయి కేసులు!

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొవిడ్-19 ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇదే సింగిల్ డే ఆల్ టైమ్ రికార్డు అని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. శనివారం ఒక్కరోజే 4,03,359 కొత్త కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. అలాగే నిన్న ఒకేరోజు 2,756 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య కోటి 76 లక్షలుగా ఉంటే.. మరణాలు 3.16 లక్షలు అయ్యాయి. మరోవైపు ఏడు రోజుల సగటు రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 238,923కు పెరిగితే.. మరణాలు 2,500కు పెరిగాయి. ఒక్క డిసెంబర్‌లోనే 42,500 మంది మరణించారు. 


ఇక ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) శుక్రవారం మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా అత్యవసర వినియోగానికి ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్రరాజ్యం ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. మహమ్మారి విజృంభణ పీక్ స్టేజ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలా రెండు సమర్థవంతమైన టీకాలు వినియోగానికి రావడం అమెరికన్లకు ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

Updated Date - 2020-12-20T16:21:35+05:30 IST