అగ్రరాజ్యంలో మ‌హ‌మ్మారి విల‌యం..!

ABN , First Publish Date - 2020-07-14T13:56:35+05:30 IST

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఆదివారం రికార్డు స్థాయిలో 15,299 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,69,811కి చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక్కరోజులోనే 15వేలకుపైగా నమోదవడం ఇదే తొలిసారి.

అగ్రరాజ్యంలో మ‌హ‌మ్మారి విల‌యం..!

ఫ్లోరిడా విలవిల.. ఒక్కరోజులోనే 15 వేల కేసులు

వాషింగ్టన్‌, జూలై 13: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఆదివారం రికార్డు స్థాయిలో 15,299 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,69,811కి చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక్కరోజులోనే 15వేలకుపైగా నమోదవడం ఇదే తొలిసారి. అలాగే అమెరికా వ్యాప్తంగా గత 24 గంటల్లో 56వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. అమెరికా తొలినుంచీ ఆరోపిస్తున్నట్టుగానే మహమ్మారి కరోనా వైర్‌సకు మూలం చైనాలోనే ఉందనే విషయాన్ని నిర్ధారించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారు చైనాలోనే ఉన్నారు. మెక్సికోలో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 35వేల మార్కుని దాటేసింది. సోమవారం ఇక్కడ 276 మంది చనిపోగా.. మొత్తం మృతులు 35,006కి చేరుకున్నారు. ఈ క్రమంలో మరణాల్లో ఈ దేశం ఇటలీ (34,954)ని దాటేసింది. పాకిస్థాన్‌లోనూ బాధితుల సంఖ్య 2.50 లక్షల మార్కుని దాటేసింది. ఇక్కడ కొత్తగా 2,769 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,51,625కి ఎగబాకింది.  


Updated Date - 2020-07-14T13:56:35+05:30 IST