ఒక్క రోజులో పది లక్షల కేసులు.. అమెరికాలో కరోనా రికార్డ్!

ABN , First Publish Date - 2022-01-05T04:00:18+05:30 IST

అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాపిస్తుండటంతో సోమవారం నాడు అగ్రరాజ్యంలో పది లక్షల పైచిలుకు ప్రజలు కరోనా బారిన పడ్డారు.

ఒక్క రోజులో పది లక్షల కేసులు.. అమెరికాలో కరోనా రికార్డ్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాపిస్తుండటంతో సోమవారం నాడు అగ్రరాజ్యంలో పది లక్షల పైచిలుకు ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇంతవరకూ మరే దేశంలోనూ నమోదు కానన్ని రోజువారీ కేసులు వెలుగు చూడటంతో అమెరికాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఒమైక్రాన్‌తో పెద్దలకు ప్రాణభయం తక్కువేనని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అక్కడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. రోగుల తాకిడిని ఆరోగ్య వ్యవస్థ తట్టుకోగలదా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పెద్దలకంటే పిల్లలపైనే ఒమైక్రాన్ ప్రభావం చూపించగలదన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్న పిల్లల సంఖ్య రికార్డు స్థాయిలో ఉండటమే ఈ ఆందోళనకు కారణమవుతోంది. 

Updated Date - 2022-01-05T04:00:18+05:30 IST