యూఎస్ సెనేట్ కీలక బిల్లుకు ఆమోదం.. భారతీయ నిపుణులకు మేలు !

ABN , First Publish Date - 2020-12-04T01:36:26+05:30 IST

యూఎస్ సెనేట్ తాజాగా కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది.

యూఎస్ సెనేట్ కీలక బిల్లుకు ఆమోదం.. భారతీయ నిపుణులకు మేలు !

వాషింగ్టన్: యూఎస్ సెనేట్ తాజాగా కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ-ఆధారిత వలస వీసాలకు సంబంధించి ప్రతి దేశం సంఖ్య పరిమితులను(కంట్రీ క్యాప్) తొలగించే బిల్లును సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదంతో కుటుంబ ఆధారిత వీసాలు కూడా పెరుగుతాయి. అంతేగాక అగ్రరాజ్యంలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి వేచి ఉన్న లక్షలాది మంది భారతీయ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చుతుంది. బుధవారం సెనేట్ ద్వారా ఆమోదం పొందిన ఫెయిర్ నెస్ ఫర్ హై-స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ హెచ్-1బీ వర్క్ వీసాలపై అమెరికాకు వచ్చే భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రీన్ కార్డు లేదా శాశ్వత నివాసానికి వారి ప్రస్తుత నిరీక్షణ కాలం దశాబ్దాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆమోదంతో అది తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చట్టం అమలుతో ఉపాధి ఆధారిత వలస వీసాలకు సంబంధించి ప్రతి దేశానికి ఇచ్చే 7 శాతం కంట్రీ క్యాప్ తొలగిపోనుంది. 

Updated Date - 2020-12-04T01:36:26+05:30 IST