Joe Biden: నిరుద్యోగంపై బైడెన్ సంచలన ప్రకటన.. యూఎస్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదట..!

ABN , First Publish Date - 2022-09-15T18:56:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగం (Unemployment) తారస్థాయికి చేరిందంటూ ఇటీవల నివేదికలు వచ్చిన నేపథ్యంలో తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Joe Biden: నిరుద్యోగంపై బైడెన్ సంచలన ప్రకటన.. యూఎస్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదట..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగం (Unemployment) తారస్థాయికి చేరిందంటూ ఇటీవల నివేదికలు వచ్చిన నేపథ్యంలో తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం అత్యల్పంగా 3.4 శాతానికి పడిపోయిందన్నారు. డెమొక్రటిక్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు కోటి ఉద్యోగాలు కల్పించినట్లు బైడెన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏ అధ్యక్షుడి హయాంలోనూ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని పేర్కొన్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 3.15లక్షల మందికి ఉద్యోగాలు (Jobs) కల్పించినట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఇక జూలైలో 5.26లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని సమాచారం. కాగా, గత నెలలో 3.7శాతంగా ఉన్న నిరుద్యోగిత ప్రస్తుతం 3.4 శాతానికి తగ్గిందని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-09-15T18:56:13+05:30 IST