భారత్‌కు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-05-09T11:09:25+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు బైడెన్‌ సర్కారు అండగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో భారతదేశ క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రవాస భారతీయులు శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారత్‌లో కరోనా కేసుల తీవ్రత హృద య విదారకంగా ఉందన్నారు.

భారత్‌కు అండగా ఉంటాం

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ 

వాషింగ్టన్‌, మే 8 : కొవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు బైడెన్‌ సర్కారు అండగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో భారతదేశ క్షేమమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రవాస భారతీయులు శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారత్‌లో కరోనా కేసుల తీవ్రత హృద య విదారకంగా ఉందన్నారు. కాగా, కరోనా వైర్‌సపై పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందని ఆ దేశ ఆరోగ్య కార్యదర్శి షావియర్‌ బెకెరా వెల్లడించారు. శుక్రవారం ఆయన భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.


Updated Date - 2021-05-09T11:09:25+05:30 IST