US Vice President కమలాహారిస్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-04-27T12:41:04+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది...

US Vice President కమలాహారిస్‌కు కరోనా పాజిటివ్

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది.కమలా హారిస్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలినా, ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైట్ హౌస్ తెలిపింది.కరోనా సోకిన కమలాహారిస్ ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ను, ప్రథమ మహిళ జిల్ బిడెన్ లను కలవలేదని వైట్ హౌస్ తెలిపింది.కరోనా సోకిన కమలాహారిస్ తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉంటూ ఆన్ లైన్ లో పనిచేస్తున్నారని వైట్ హౌస్ అధికారులు చెప్పారు. కరోనా నెగిటివ్ అని తేలిన తర్వాతే కమలా హారిస్ వైట్ హౌస్ విధులకు వస్తారని అమెరికా అధికారులు చెప్పారు. 57 ఏళ్ల కమలా మోడర్నా కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని వారాల ముందు, 2021లో రెండవడోసు, ఏప్రిల్ 1వతేదీన బూస్టర్ డోస్ వేయించుకున్నారు. మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న కమలా హారిస్ కు కరోనా సోకింది. పూర్తిగా టీకాలు వేయించుకున్నందున అధిక స్థాయి రక్షణ ఉందని వైద్యాధికారులు చెప్పారు. 


Updated Date - 2022-04-27T12:41:04+05:30 IST