Advertisement

14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం.. చివరికి

Mar 6 2021 @ 13:00PM

అర్కాన్సాస్(యూఎస్): ఏడాది పాటు 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం నెరిపిన అమెరికా మహిళ గర్భం దాల్చింది. యూఎస్‌లోని అర్కాన్సాస్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే బ్రిట్ని గ్రే అనే మహిళ.. 14 ఏళ్ల మైనర్‌తో అతని పేరెంట్స్‌కు తెలియకుండా అక్రమ సంబంధం కొనసాగించింది. అయితే, ఒకరోజు బాలుడితో బ్రిట్ని శృంగారంలో ఉండగా పొరుగింటిలో ఉండే ఓ వ్యక్తి చూశాడు. ఆ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో బాలుడి తల్లిదండ్రులు బ్రిట్నిని నిలదీయగా ఏడాదిగా తమ మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ అయిన తమ కుమారుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకోవడం అఘాయిత్యానికి పాల్పడడమేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు బ్రిట్నిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ నెల 1న ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం 5వేల డాలర్ల(రూ.3.65 లక్షలు) పూచీకత్తుపై విడుదల చేశారు. ఏప్రిల్ 23న ఆమె న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంది. అయితే, బ్రిట్నికి నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది.     

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.