సెకండ్ హ్యాండ్‌లో సోఫాను కొనుగోలు చేసిందో మహిళ.. శుభ్రం చేద్దామని తీస్తే కనిపించిన కవర్లు.. వాటిల్లో..

ABN , First Publish Date - 2022-06-06T17:17:27+05:30 IST

ఆ మహిళ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఓ కుటుంబం నుంచి పాత సోఫాను కొనుగోలు చేసింది..

సెకండ్ హ్యాండ్‌లో సోఫాను కొనుగోలు చేసిందో మహిళ.. శుభ్రం చేద్దామని తీస్తే కనిపించిన కవర్లు.. వాటిల్లో..

ఆ మహిళ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఓ కుటుంబం నుంచి పాత సోఫాను కొనుగోలు చేసింది.. సోఫా ఇంటికి వచ్చిన తర్వాత దానిని శుభ్రం చేయడానికి ప్రయత్నించింది.. ఆ సమయంలో సోఫా లోపలి నుంచి కొన్ని కవర్లు బయటపడ్డాయి.. ఆ కవర్లలో వేల కొద్ది అమెరికన్ డాలర్లు కనిపించాయి.. మొత్తం 36 వేల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.28 లక్షలు) ఉన్నాయి.. అయితే ఆ మహిళ ఆ డబ్బులను తన ఖర్చులకు ఉపయోగించుకోకుండా ఆ సోఫా పాత యజమానులకు ఇచ్చేసింది. 


ఇది కూడా చదవండి..

ట్రాఫిక్ కష్టాలతో ఫ్రస్ట్రేషన్.. ఆ వ్యక్తి చేసిన ఫన్నీ ట్వీట్ ఎంత వైరల్‌గా మారిందంటే..


అమెరికాలోని కాలీఫోర్నియాకు చెందిన విక్కీ ఉమోదు అనే మహిళ ఆన్‌లైన్ ద్వారా సెకెండ్ హ్యాండ్ సోఫాను కొనుగోలు చేసింది. దానిని తన కొత్త ఇంట్లో సర్దుతుండగా ఆ సోఫా లోపలి నుంచి కొన్ని కవర్లు బయటపడ్డాయి. ఆ కవర్లలో మొత్తం 36 వేల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.28 లక్షలు) ఉన్నాయి. విక్కీ ఆ డబ్బులను స్వంతదారులకు ఇచ్చెయ్యాలని నిర్ణయించుకుంది. తను సోఫా ఎవరి నుంచి కొన్నదో వారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. మొత్తం డబ్బును వారికి ఇచ్చేసింది. విక్కీ నిజాయితీపై ఆ కుటుంబం ప్రశంసలు కురిపించింది. విక్కీ కొత్త ఇంటికి తమ బహుమతిగా రూ.1.50 లక్షల విలువైన కొత్త ఫ్రిజ్‌ను బహుమతిగా ఇచ్చింది. 

Updated Date - 2022-06-06T17:17:27+05:30 IST