భర్తకు విడాకులిచ్చి మామను పెళ్లాడింది!

ABN , First Publish Date - 2021-04-22T16:35:17+05:30 IST

అమెరికాలో ఓ వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

భర్తకు విడాకులిచ్చి మామను పెళ్లాడింది!

మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవడం, కొంత కాలం తర్వాత విభేదాలు తలెత్తితే విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో అయితే మరింత కామన్. అయితే అమెరికాలో ఓ వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎరికా అనే మహిళ తన భర్తకు విడాకులిచ్చి.. అతని తండ్రిని వివాహం చేసుకుంది. 


కెంటుకీ ప్రాంతంలో నివసిస్తున్న ఎరికా కొన్నేళ్ల క్రితం జస్టిన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ బాబు కూడా పుట్టాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి సంసారంలో కలతలు వచ్చాయి. దాంతో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం జెఫ్‌తో ఎరికా ప్రేమలో పడింది. ఈ జెఫ్ వేరెవరో కాదు.. జెస్టిన్ సవతి తండ్రి. తన కంటే 29 ఏళ్ల పెద్దవాడు, ఒకప్పుడు తనకు మామ అయిన జెఫ్‌ను ఎరికా ఇటీవలె వివాహం చేసుకుంది. ఒకప్పుడు తన భార్య అయిన ఎరికా ఇప్పుడు పిన్ని కావడాన్ని జెస్టిన్ నమ్మలేకపోతున్నాడు. విశేషం ఏమిటంటే.. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.

Updated Date - 2021-04-22T16:35:17+05:30 IST