సీడీసీ కీలక ప్రకటన.. 16ఏళ్లు దాటిన వారికి టీకా!

ABN , First Publish Date - 2021-04-22T04:39:03+05:30 IST

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కీలక ప్రకటన చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 16ఏళ్లు, అంతకంటే ఎక్కవ వయసు గల వారికి తొలి ప్రాధాన్యంలో కొవిడ్ టీకా ఇవ్వాలని సూ

సీడీసీ కీలక ప్రకటన.. 16ఏళ్లు దాటిన వారికి టీకా!

వాషింగ్టన్: అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కీలక ప్రకటన చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 16ఏళ్లు, అంతకంటే ఎక్కవ వయసు గల వారికి తొలి ప్రాధాన్యంలో కొవిడ్ టీకా ఇవ్వాలని సూచించింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే మరింత ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆ దిశగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. 16 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి అలస్కాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జార్జియా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలు కూడా 16 సంవత్సరాలు దాటిన వారికి టీకా అందిస్తున్నాయి. 

Updated Date - 2021-04-22T04:39:03+05:30 IST