Advertisement

మొబైల్‌ ఏటీఎంను వినియోగించుకోవాలి

May 4 2021 @ 00:16AM
మొబైల్‌ ఏటీఎంను ప్రారంభిస్తున్న డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ బాలరాజు

పరిగి: మొబైల్‌ ఏటీఎంను ప్రజలు వినియోగించుకోవాలని పరిగి డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ బాలరాజు అన్నారు. సోమవారం కొత్తగా వచ్చిన డీసీసీబీ మొబైల్‌ ఏటీఎం వాహనాన్ని మేనేజర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్‌ చొరవతోనే పరిగికి మొబైల్‌ వాహనాన్ని సమకూర్చారని తెలిపారు. ఈ మొబైల్‌ వాహనం పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లో తిరుగుతుంటుందని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనం బ్యాంకుల వద్దకు రావద్దని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ సవిత, ఫీల్డ్‌ అధికారి రాజునాయక్‌, తదితరులున్నారు. 

Follow Us on:
Advertisement