పరిశోధనలో షాకింగ్ నిజాలు.. ప్రీడయాబెటీస్‌తో బాధపడేవారు బాదం తింటే!

Jul 7 2021 @ 22:59PM

బాదములను తినడం వల్ల హెచ్‌బీఏ1సీ వృద్ధి చెందడంతో పాటుగా బ్లడ్‌ లిపిడ్స్‌ సైతం యువత, ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కౌమారదశ బాలల్లో వృద్ధి చెందుతుందని నూతన అధ్యయనంలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే.. గత 40 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా  నాలుగు రెట్లు పెరిగింది. రోజు రోజుకీ పైపైకి పెరుగుతున్న ఈ కేసుల సంఖ్య భారతదేశంలో మరింత ఎక్కువగా ఉంది. నిజానికి, భారతీయులలో ప్రీ డయాబెటీస్‌ నుంచి  టైప్‌ 2 మధుమేహంగా వృద్ధి చెందడం ఎక్కువగా ఉంది (దాదాపు 14–18%). ఈ క్రమంలో జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ ధోరణిని అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 


బాదములను స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల  భారతదేశంలో ప్రీ డయాబెటీస్‌ దశలోని కౌమారదశ  మరియు యువతలో గ్లూకోజ్‌ మెటబాలిజం వృద్ధి చెందుతుందని నూతన అధ్యయనంలో తేలింది. 275 మంది అభ్యర్థులను గ్రూపులుగా విభజించి జరిపిన పరిశోధనల్లో బాదములు తీసుకున్న వారిలో  హెచ్‌బీఏ1సీ స్థాయిలు నియంత్రిత గ్రూప్‌తో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమైంది. 


‘పౌష్టికాహారం మరియు వ్యాయామాలు సహా జీవనశైలి మార్పులు వంటివి కౌమార దశ వయసుతో పాటుగా యుక్త వయసులోని పెద్దలలో ప్రీ డయాబెటీస్‌ నుంచి టైప్‌ 2 డయాబెటస్‌గా మారడం నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతి రోజూ రెండు పూటలా బాదములు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ పరిశోధనలో టోటల్‌, ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుందో చూపడంతో పాటుగా హెచ్‌బీఏ1సీ స్థాయిలు కూడా ఏ విధంగా కేవలం 12 వారాల వినియోగంతో తగ్గాయో వెల్లడైంది’ అని ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ జగ్మీత్‌ మదన్‌.. ప్రొఫెసర్‌ –ప్రిన్సిపాల్‌, విఠల్‌దాస్‌ ఠాకర్‌సీ కాలేజీ ఆఫ్‌ హోమ్‌ సైన్స్‌ (అటానమస్‌), ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్‌ యూనివర్శిటీ (ముంబై) అన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.