ట్రూకాలర్‌తో ఉపయోగాలు ఎన్నో

ABN , First Publish Date - 2021-04-24T07:07:18+05:30 IST

పాపులర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌గా ‘ట్రూకాలర్‌’కు పేరుంది. ఎక్కువ మంది ఇది నేమ్‌ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. కానీ కాల్‌ రికార్డింగ్‌, కాల్‌ బ్లాకింగ్‌, ఫ్లాష్‌ మెసేజింగ్‌ తదితరాలన్నింటికీ కూడా ట్రూకాలర్‌ ఉపయోగపడుతుంది. నిజానికి దీనిని ఎలా ఉపయోగించ వచ్చో చూద్దాం...

ట్రూకాలర్‌తో ఉపయోగాలు ఎన్నో

పాపులర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌గా ‘ట్రూకాలర్‌’కు పేరుంది. ఎక్కువ మంది ఇది నేమ్‌ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. కానీ కాల్‌ రికార్డింగ్‌, కాల్‌ బ్లాకింగ్‌, ఫ్లాష్‌ మెసేజింగ్‌ తదితరాలన్నింటికీ కూడా ట్రూకాలర్‌ ఉపయోగపడుతుంది.  నిజానికి దీనిని ఎలా ఉపయోగించ వచ్చో చూద్దాం...


సిమ్‌కార్డ్‌ లొకేషన్‌ తెలుసుకోవచ్చు

ట్రూకాలర్‌తో కాల్‌ చేస్తున్న వ్యక్తి ఎవరు అన్నది వినియోగదారుడికి ముందుగానే తెలుస్తుంది. తద్వారా ఆ కాల్‌కు అటెండ్‌ కావచ్చా, లేదా అన్నది యూజర్‌ తేల్చుకోవచ్చని అందరికీ తెలిసిందే. అయితే ట్రూకాలర్‌ ద్వారా కాల్‌ చేసిన వ్యక్తి లోకేషన్‌ను పట్టుకోలేం.  కాకపోతే సిమ్‌కార్డు ఎక్కడ రిజిస్ట్రేషన్‌  అయిందో మాత్రం తెలుసుకోవచ్చు. జీపీఎస్‌ లేదంటే లైవ్‌ లొకేషన్‌ మాత్రం కుదరదు. 


హిడెన్‌ నెంబర్స్‌ను చూడొచ్చు

ట్రూకాలర్‌లో హిడెన్‌(కనిపించని) నెంబరును కూడా చూడవచ్చు. అందుకోసం ఫోన్‌ సెట్టింగ్స్‌లో ‘ఫోన్‌’ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి. తదుపరి ‘కాల్‌ బ్లాకింగ్‌ అండ్‌ ఐడెంటిఫికేషన్‌’ను టాప్‌ చేయాలి. ‘షో మై కాలర్‌ ఐడి’ని టోగెల్‌(ఆపోజిట్‌ ఎఫెక్ట్‌ కోసం ఉపయోగించడం) చేయాలి. అలా చేస్తే హిడెన్‌ నెంబర్‌ను కనుగొనవచ్చు. 


ట్రూకాలర్‌ నుంచి నెంబర్‌ తొలగించుకోవచ్చు 

అందుకోసం ట్రూకాలర్‌ అన్‌లిస్ట్‌ పేజీని సందర్శించాలి. దేశానికి సంబంధించిన కోడ్‌ సహా మీ నెంబర్‌ని ఎంటర్‌ చేయాలి. రీజన్‌ ఫర్‌ అన్‌లిస్టింగ్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. లేదంటే అందులో ఆప్షన్‌ లేకుంటే రీజన్‌ను టైప్‌ చేయాలి. కాప్చ(కంప్లీట్‌లీ ఆటోమేటెడ్‌ పబ్లిక్‌ ట్యూరింగ్‌ టెస్ట్‌ - రియల్‌, ఆటోమేటెడ్‌ యూజర్ల మధ్య తేడాను తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు)ని వెరిఫికేషన్‌ కోసం ఎంటర్‌ చేయాలి. చివరగా అన్‌లిస్ట్‌ ఆప్షన్‌ని క్లిక్‌ చేస్తే చాలు ట్రూకాలర్‌ నుంచి మీ నంబర్‌ను తొలగించుకోవచ్చు. 


ట్రూకాలర్‌ ప్రొఫైల్‌ ఎవరు చూడొచ్చు

మీ ట్రూకాలర్‌ ప్రొఫైల్‌ను ఎవరుపడితే వారు చూసే వీలు ఉండదు. మీ ట్రూకాలర్‌ అకౌంట్‌ను వెరిఫై చేసి, సెటప్‌ చేసిన తరవాత  ఆ వివరాలు కొత్తవారికి కనిపించవు. అలాగే ఎవరైనా మీ పేరు, ఫోన్‌ నెంబర్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌చేస్తే ముందు మీ అనుమతి కూడా పొందాల్సి ఉంటుంది. 


సెర్చ్‌ చేస్తే తెలుస్తుంది

ట్రూకాలర్‌ యాప్‌ ద్వారా ఎవరైన తమ గురించి సెర్చ్‌ చేస్తే ‘ట్రూకాలర్‌ ప్రో సబ్‌స్క్రయిబర్స్‌’కి సమాచారం తెలుస్తుంది. అయితే ప్రైవేట్‌ మోడ్‌లో ఉంటే మాత్రం తెలియదు.  


ట్రూకాలర్‌కి మన పేరు ఎలా తెలుసు

‘ట్రూకాలర్‌’కి మన పేరు ఎలా తెలుస్తుంది. ఇది చాలా మందికి వచ్చే సందేహం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ఫోన్‌డైరెక్టరీల నుంచి ‘ట్రూకాలర్‌’ నెంబర్లను సేకరిస్తుంది. అందుకోసం అనేకానేక అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది సేవ్‌ చేసుకున్న పేరు, నెంబర్‌ ఆధారంగా కరెక్ట్‌గా ట్రేస్‌ చేయగలుగుతుంది.  


ప్రొఫైల్‌ను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు

మన ప్రొఫైల్‌ను ఎవరెవరు  చూశారన్నది కూడా తెలుసుకోవచ్చు. అందుకోసం ట్రూకాలర్‌ యాప్‌ నోటిఫికేషన్‌ను టాప్‌ చేయాలి. లేదా ‘హు వ్యూడ్‌ మై ప్రొపైల్‌’ ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా ఎవరెవరు మీ ప్రొఫైల్‌ చూశారో తెలుసుకోవచ్చు 


ట్రూకాలర్‌లో బ్లూటిక్‌ అర్థం ఏమిటంటే...

ట్రూకాలర్‌ యూజర్‌కు సంబంధించి ఇండికేషన్‌ బ్లూ టిక్‌. ట్రూకాలర్‌ యాప్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్న తరవాత పేరు పక్కన బ్లూ అవతార్‌ బాడ్జ్‌ దర్శనమిస్తుంది. 


ట్రూకాలర్‌ మెసేజ్‌లను చదువుతుందా...

మీకు వచ్చిన లేదా పంపిన మెసేజ్‌ను ట్రూకాలర్‌ చదవలేదు. మీకు వచ్చిన వాటిని అనలైజ్‌ చేసి స్పామ్‌ మెసేజా కాదా అన్నది తేల్చగలదు. సెండర్‌ను ఐడెంటిఫై చేయగలదు. తద్వారా చేసే కాల్స్‌, మెసేజ్‌లు పక్కాగా సురక్షితం అని చెబుతుంది.


ట్రూకాలర్‌తో కాల్‌ చేస్తున్న వ్యక్తి ఎవరు అన్నది వినియోగదారుడికి ముందుగానే తెలుస్తుంది. తద్వారా ఆ కాల్‌కు అటెండ్‌ కావచ్చా, లేదా అన్నది యూజర్‌ తేల్చుకోవచ్చని అందరికీ తెలిసిందే.


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ఫోన్‌డైరెక్టరీల నుంచి ‘ట్రూకాలర్‌’ నెంబర్లను సేకరిస్తుంది. అందుకోసం అనేకానేక అల్గోరిథమ్స్‌ను ఉపయోగిస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది సేవ్‌ చేసుకున్న పేరు, నెంబర్‌ ఆధారంగా కరెక్ట్‌గా ట్రేస్‌ చేయగలుగుతుంది.

Updated Date - 2021-04-24T07:07:18+05:30 IST