ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌

ABN , First Publish Date - 2021-05-04T05:30:00+05:30 IST

ఆక్సిజన్‌ శాతం పడిపోయిన ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను వాడుకోవచ్చు అనుకుంటే పొరపాటు...

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌

ఆక్సిజన్‌ శాతం పడిపోయిన ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను వాడుకోవచ్చు అనుకుంటే పొరపాటు. స్వల్ప కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారికి మాత్రమే ఇవి ఉపయోగకరం. ఆక్సిజన్‌ పరిమాణం స్వల్పంగా తగ్గి, నిమిషానికి 5 లీటర్ల ఆక్సిజన్‌ అవసరమయ్యే వారు మాత్రమే వీటిని వాడుకోవాలి. 


ఎవరికి వారు వాడుకోవచ్చా?

కొవిడ్‌ మూలంగా స్వల్ప న్యుమోనియా, లేదా ఊపిరితిత్తుల సమస్యలు కలిగి ఉండి, ఆక్సిజన్‌ శాచురేషన్‌ 94శాతం కంటే తక్కువగా నమోదవుతున్నప్పుడు, ఆస్పత్రికి చేరుకునేవరకూ, ఈ పరికరం ద్వారా ఆక్సిజన్‌ కొరతను భర్తీ చేసుకోవచ్చు. ఇందుకోసం చెస్ట్‌ ఫిజీషియన్‌ లేదా ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ సహాయం తీసుకోవాలి. వైద్య సలహా తీసుకోకుండా వీటిని ఎవరికి వారు వాడుకోవడం ప్రమాదకరం.


Updated Date - 2021-05-04T05:30:00+05:30 IST