ఊటీకి Special Train

Published: Sat, 21 May 2022 12:48:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఊటీకి Special Train

ఐసిఎఫ్‌(చెన్నై): పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఊటీకి ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. మేట్టుపాళయం-ఊటీ మధ్య నెం.06171 ప్రత్యేక రైలు శనివారాల్లో ఉదయం 9 గంటలకు మేట్టుపాళయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు ఊటీ చేరుకుంటుంది. ఈ రైలు శనివారం నుంచి జూలై 16వ తేదీ వరకు నడుపనున్నారు. ఇదే విధంగా మరో మార్గంలో ఊటీ-మేట్టుపాళయం నెం.06172 ప్రత్యేక రైలు శుక్రవారాల్లో ఉదయం 11.25 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20 గంటలకు మేట్టుపాళయం చేరుకుంటుంది. ఈ రైళ్లను ఈ నెల 27 నుంచి జూలై 22వ తేదీ వరకు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.