ఇంత అన్యాయమా?

ABN , First Publish Date - 2020-10-10T05:52:35+05:30 IST

స్త్రీలను గౌరవించే చోట దేవతలు నర్తిస్తారని అంటూనే, గౌరవం కాదు కదా స్వంత శరీరంపై కూడా హక్కులేని దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి...

ఇంత అన్యాయమా?

స్త్రీలను గౌరవించే చోట దేవతలు నర్తిస్తారని అంటూనే, గౌరవం కాదు కదా స్వంత శరీరంపై కూడా హక్కులేని దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. నిర్భయ చట్టం పేరుకే మిగిలిపోయింది. ప్రభుత్వ అండదండలతోనే నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, హత్యాచారాల పరంపర కొనసాగుతున్నది. అత్యాచారాలు, హత్యాచారాలు జమిలిగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మానవ మృగాలకు అండదండలనివ్వడమే కాదు ప్రోత్సహిస్తున్నాడనే భావన ప్రజలలో బలపడుతున్నది. ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ విషయాన్ని ఋజువు చేస్తున్నాయి. మనీషా ఘటనకు ప్రపంచమే సిగ్గుతో తలదించుకుంటున్నది. ఆ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం బాధితురాలిని ఆదుకోలేదు. మరణ వాంగ్మూలాన్ని సహితం బేఖాతరు చేశారు. ఆమె చావుకు అత్యాచారం కారణం కాదని ప్రకటించారు. యు.పి. ముఖ్యమంత్రి రాజకీయ సన్యాసం తీసుకోవాలి. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో జోక్యం కలిగించుకుని నేరస్తులను శిక్షించాలి.


– ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, హైదరాబాద్‌

Updated Date - 2020-10-10T05:52:35+05:30 IST