ఉప ఎన్నికల్లో Uttarakhand CM పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం

ABN , First Publish Date - 2022-06-03T16:37:00+05:30 IST

చంపావత్ ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘనవిజయం సాధించారు....

ఉప ఎన్నికల్లో Uttarakhand CM పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం

డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి

చంపావత్(ఉత్తరాఖండ్):  చంపావత్ ఉప ఎన్నికలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘనవిజయం సాధించారు.శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.గత సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు పుష్కర్ సింగ్ ధామి ఈ ఉప ఎన్నికల్లో ఎన్నిక కావాల్సి వచ్చింది.పుష్కర్ సింగ్ ధామి చంపావత్ ఉప ఎన్నికలో 54 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.ఈ సీటులో కాంగ్రెస్ తొలిసారి డిపాజిట్ కోల్పోయింది.‘‘చంపావత్ ఉపఎన్నికలో ఓట్ల ద్వారా మీరు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం చాలా ఉద్వేగానికి లోనైంది, నేను నోరు మెదపలేకపోయాను’’ అని ముఖ్యమంత్రి ధామి తన విజయం తర్వాత ట్వీట్ చేశారు.


Updated Date - 2022-06-03T16:37:00+05:30 IST